
వేడి పాత్రలో పడి ఓ చిన్నారి మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మాదారంలో చోటు చేసుకుంది. మాదారం గ్రామానికి చెందిన స్వామి, మహేశ్వరీదంపతుల కొడుకు మోక్షిత్ (2) తనపెదనాన్న ఎల్లం ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో జులై 2న వేడి గంజి ఉంచిన తొట్టిలో పడ్డాడు.
తీవ్రంగా గాయపడ్డ ఆ చిన్నా రిని వెంటనే హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. జులై 5న తెల్లవారు జామున చికిత్స పొందుతూ మృతి చెందాడు. రెండేళ్ల బాలుడి మృతితో కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. బాధితుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు గౌరారం ఎస్ఐ కరుణాకర్ రెడ్డి తెలిపారు.