
మహారాష్ట్రలో భాష విద్వేషం మళ్ళీ రచ్చకెక్కింది. గతంలో బెంగుళూరులో కన్నడ మాట్లాడాలని ఓ ఆటో డ్రైవర్ సాఫ్ట్ వేర్ మధ్య గొడవ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం లేపింది. ఇప్పుడే అదే తరహా వివాదం మహారాష్ట్ర చోటు చేసుకుంది. తాజాగా ఓ వ్యాపారవేత్త అయిన సుశీల్ కేడియా ఆఫీసును మహారాష్ట్ర నవీర్మాన్ సేన (MNS) కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఇందుకు కారణం అతను మరాఠీ నేర్చుకోనని పేర్కొంటూ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్. ఈ పోస్ట్ చేసిన రెండు రోజుల తర్వాత కొంతమంది అతని షాపు పై రాళ్లు విసిరారు. అయితే ఈ వీడియోలో ఒక ఆర్మీ భద్రతా సిబ్బంది కూడా వారిని ఆపడానికి ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు.
వివరాలు చూస్తే ముంబైలో మరాఠీ భాష రాదనే కారణంతో ఒక ఫుడ్ స్టాల్ ఓనరుని రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) కార్యకర్తలు కొట్టారు. ఈ వీడియో చాల వైరల్ అయ్యింది. అయితే ఈ దాడి తరువాత సుశీల్ కేడియా Xలో చేసిన పోస్టులో రాజ్ థాక్రేని ట్యాగ్ చేస్తూ నేను ముంబైలో 30 సంవత్సరాలుగా ఉంటున్నాను, అయినా నాకు మరాఠీ స్పష్టంగా రాదు. మీ 100 మంది కార్మికులతో నన్ను బెదిరించడం వల్ల నేను మరాఠీ ఎక్స్పర్ట్ కాలేను అని అన్నారు.
నేను మాట్లాడే మరాఠీ బాషా పై నాకు నమ్మకం లేకపోతే, బెదిరింపులు ఉంటాయి, ఏదైనా పదాలు సరిగ్గా మాట్లాడకపోతే హింస జరుగుతుందనే భయం ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. బెదిరింపులు కాదు, ప్రజలను ప్రేమ మాత్రమే ఒకచోట చేర్చుతుంది అని అన్నారు. సుశీల్ కేడియా తనను బెదిరిస్తున్న పోస్ట్‌లను షేర్ చేసి ముంబై పోలీసు కమిషనర్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, హోంమంత్రి అమిత్ షా లను ట్యాగ్ చేస్తూ భద్రత కల్పించాలని కోరారు.
ఈ దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ వ్యక్తులపై నోటీసులు జారీ అయ్యాయి. తరువాత వారిపై కేసు కూడా నమోదైంది. ఈ విషయంపై ముఖ్యమంత్రి ఫడ్నవీస్ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, మహారాష్ట్రలో మరాఠీ భాష పట్ల గర్వపడటంలో తప్పు లేదని, కానీ ఎవరైనా భాష పేరుతో దాడులకు పాల్పడితే, మేము దానిని సహించము అని స్పష్టం చేసారు.