
అనుష్క నటించిన యాక్షన్ క్రైమ్ డ్రామా ‘ఘాటి’ (GHAATI). జూలై 11, 2025న విడుదల కావాల్సి ఉన్న ఈ మూవీ మరోసారి వాయిదా పడింది. నేడు (జులై5న) ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు Xలో నోట్ రిలీజ్ చేస్తూ పోస్ట్ పెట్టారు. సినిమాకు సంబంధించిన సీజీ (కంప్యూటర్ గ్రాఫిక్స్) పనులు ఇంకా పెండింగ్‌లో ఉండటం వల్ల రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
‘‘సినిమా ఒక జీవనదిలాంటిది. అది ప్రవహించే క్రమంలో కొన్నిసార్లు ఉరకలు వేస్తుంది. మరికొన్నిసార్లు లోతు పెంచుకోవడం కోసం ఆగుతుంది. ‘ఘాటి’కేవలం సినిమా మాత్రమే కాదు. ఇది ఒక ప్రతిధ్వని.. ఒక అడవి గాలి.. మట్టి నుండి పుట్టిన కథ. ప్రతి ఫ్రేమ్‌ను మీకు అద్భుతంగా అందించాలనే ఉద్దేశంతో ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నాం.
సినిమాపై మీకున్న ప్రేమకు, మీ సహనానికి మా కృతజ్ఞతలు. సినిమా అవుట్‌పుట్ బెస్ట్గా వచ్చిన తర్వాతే విడుదల చేయడానికి ముందుకొస్తాం. ఈ ప్రయాణంలో మీరు మాపై చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’’ అని టీమ్ వెల్లడించింది.
Team #GHAATI pic.twitter.com/UhUtWuMR6g
— UV Creations (@UV_Creations) July 5, 2025
ఘాటి కథ విషయానికి వస్తే:
ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసే ఓ సాధారణ మహిళగా అనుష్క కనిపించనుందట. ఇంకాస్త లోతుగా చెప్పాలంటే.. 'అనుకోని పరిస్థితుల కారణంగా ఒక రొచ్చులో ఇరుకున్న మహిళ.. తన సాధికారికతను చూపించుకోవడానికే ఎలా పోరాడింది? ఆ పోరాటంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది' అనే కథతో ఈ సినిమా తెరకెక్కించారు క్రిష్.