
- సీఎం రేవంత్‌కు ఎమ్మెల్యే కూనంనేని విజ్ఞప్తి
బషీర్ బాగ్, వెలుగు : టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్‌లో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్‌చేయాలని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సీఎం రేవంత్ రెడ్డి కోరారు. గురువారం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో క్యాంప్ ఆఫీసులో సీఎంను కలిసి వినతి పత్రం ఇచ్చారు. రెగ్యుగలర్ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా.. అందుకు తగినట్లు వేతనం రావడం లేదని ఎమ్మెల్యే కూనంనేని సీఎంతో చెప్పారు.
అనుభవజ్ఞులను రెగ్యులర్చేస్తే కార్పొరేషన్ అభివృద్ధి చెందుతుందని చెప్పారు. సీఎంను కలిసిన వారిలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధి రాజమౌళి, సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు పల్లా వెంకటరెడ్డి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు, ఎన్.బాలమల్లేశ్, వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు ఉన్నారు.