V6 News

చిన్నారులకు నాణ్యమైన పోషకాహారం అందించాలి :  ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

చిన్నారులకు నాణ్యమైన పోషకాహారం అందించాలి :  ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

తొగుట (దుబ్బాక) వెలుగు: దుబ్బాక నియోజకవర్గంలోని అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు నాణ్యమైన పోషకాహారం అందేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. శనివారం దుబ్బాక ఐసీడీఎస్ కార్యాలయంలో నిర్వహించిన ‘బేటీ బచావో–బేటీ పడావో’, ‘పోషణ్ అభియాన్’ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ  చైర్మన్ బక్కి వెంకటయ్య, మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ సంగీత రవీందర్‌‌‌‌‌‌‌‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ టీచర్లకు స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్లు పంపిణీ చేశారు.  దుబ్బాక నియోజకవర్గంలో కొత్త అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ భవనాల నిర్మాణానికి స్థలాలు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అక్బరుపేట–భూంపల్లి మండలాల చిట్టాపూర్, ఖాజీపూర్ గ్రామాల్లో పెద్దమ్మ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.