'డబుల్' ఇండ్ల కల.. తీరిన వేళ

'డబుల్' ఇండ్ల కల.. తీరిన వేళ
  • 715 మందికి ఇండ్లు పంపిణీ
  • అమ్మితే క్యాన్సిల్ చేస్తాం: ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి

గద్వాల, వెలుగు: రెండేండ్ల నిరీక్షణకు తెరపడింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 715 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందాయి. ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని గద్వా లలో శనివారం అట్టహాసంగా నిర్వహించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృ ష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమో హన్రెడ్డి, కలెక్టర్సంతోష్ ఇండ్లు పంపిణీ చేయగా.. లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసుకున్నారు. 

ఈ ఇండ్లను ఎవరైనా అమ్మితే వారి పట్టాలు క్యాన్సిల్ చేస్తామని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి హెచ్చరిం చారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి గద్వాల నియోజకవర్గంలో 2,100 మందికి మొదటి విడతగా రూ. లక్ష వారి అకౌంట్లలో జమ చేశామని తెలిపారు. లబ్ధిదారులు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో నివసించాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. సొంతిల్లు లేక ఏండ్లుగా కిరాయి ఇండ్లలో ఉంటు న్నామని, ఇప్పుడు ఇల్లు రావడం సంతోషంగా ఉందని లబ్దిదారులు రాజమ్మ, లక్ష్మి తదితరులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటామని పేర్కొన్నారు.