సింగరేణి గనులకు పుట్టినిల్లు ఇల్లెందు : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

సింగరేణి గనులకు పుట్టినిల్లు ఇల్లెందు : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
  • ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి బొగ్గు గనులకు పుట్టినిల్లు అయిన ఇల్లెందు అని, దీని అభివృద్ధికి యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కొత్తగూడెం ఎమ్మెల్యే, సింగరేణి కాలరీస్​ వర్కర్స్​ యూనియన్ గౌరవ అధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు సూచించారు. సోమవారం సింగరేణి భవన్​లో సింగరేణి సీఎండీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గంలోని పాల్వంచలో సింగరేణి ఆధ్వర్యంలో థర్మల్ పవర్ ప్లాంట్​ఏర్పాటు చేయాలన్నారు. సింగరేణి మెయిన్ హాస్పిటల్​లో గుండె రోగులకు క్యాథ్​ లాగ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. 

కొత్త బొగ్గు బాయిలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. కొత్తగూడెం బస్టాండ్​ నిర్మాణానికి యాజమాన్యం సహకరించాలని కోరారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సీఎండీకి అందజేశారు.