ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత : ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత : ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి

అమీన్​పూర్, వెలుగు: అమీన్​పూర్​ మున్సిపల్​ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి తెలిపారు. బుధవారం మున్సిపల్​పరిధిలోని వడక్​పల్లి పరిధిలో రూ.2.70 కోట్లతో నిర్మించిన హైలెవల్​ బ్రిడ్జిని ప్రారంభించారు. బొమ్మనకుంటలో రూ.15లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, వడక్​పల్లిలో  రూ.10 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు, అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ పనులకు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. 

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన అంతర్గత  రవాణా సౌకర్యం కల్పించేందుకు హైలెవల్​ బ్రిడ్జి, కల్వర్టులు  నిర్మిస్తున్నట్లు చెప్పారు. మున్సిపల్​ పరిధిలో విలీనమైన గ్రామాలలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్​ కమిషనర్ జ్యోతిరెడ్డి, మాజీ ఎంపీపీ దేవానంద్​, మాజీ జెడ్పీటీసీ సుధాకర్​రెడ్డి, ​ ఇంజనీరింగ్​ డీఈ వెంకటరమణ,  పంచాయతీ రాజ్​ డీఈ సురేశ్​, నాయకులు మల్లేశ్​, పాండు, భాస్కర్​గౌడ్​, శ్రీకాంత్​రెడ్డి, రామిరెడ్డి, శ్రీకాంత్​ పాల్గొన్నారు.