రామచంద్రాపురం, వెలుగు: పటాన్చెరు నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు, వాటిలో విలీనమైన గ్రామాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కర్ధనూర్, ఘనాపూర్, వెలిమెల, వెలిమెల తండా, ఉస్మాన్‌నగర్, తెల్లాపూర్‌లలో రూ. 7 కోట్ల 20 లక్షల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్లు, యూజీడీ, ప్రహరీ నిర్మాణ పనులను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా పూర్తి పారదర్శకతతో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. అవినీతికి తావు లేకుండా మెరుగైన పాలన అందించడమే తమ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్మాజీ వైస్‌చైర్మన్ రాములు గౌడ్, మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి, మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రవీందర్ రెడ్డి, బాబ్జీ, శ్రీశైలం, దేవేందర్, నర్సింహా, శ్యాంరావు, ఉమేశ్, రాజ్కుమార్పాల్గొన్నారు.
