రియల్ ఎస్టేట్ ప్రభుత్వం పోయింది...ప్రజా ప్రభుత్వం వచ్చింది: ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి

రియల్ ఎస్టేట్ ప్రభుత్వం పోయింది...ప్రజా ప్రభుత్వం వచ్చింది: ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి

తెలంగాణ వస్తే బాగుపడతామని సకలజనులు ఐక్యంగా ఉద్యమించి తెలంగాణని తెచ్చుకున్నామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు.  డిసెంబర్ 10వ తేదీ ఆదివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నుండి మంచాల వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణికులతో కలసి మల్ రెడ్డి రంగారెడ్డి ప్రయాణించారు. మహిళలందరికీ ఉచితంగా ప్రయాణం కల్పించే  మహాలక్ష్మి పథకంపై దాదాపు 6 బస్సులు ఎక్కి మహిళలతో ప్రయాణించి వారితో మాట్లాడారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ...  కాంగ్రేస్ పార్టీ మిగులు బడ్జెట్ తో రాష్ట్రాన్ని ఇస్తే... కేసీఆర్10 సంవత్సరాలలో  ధనిక రాష్ట్రాన్ని  అప్పులపాలు చేశారని విమర్శించారు. తాను ఇచ్చిన రాష్ట్రం ఇది కాదని   సోనియా గాంధీ .. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆరు పథకాలు తీసుకోచ్చారని చెప్పారు. పేద ప్రజల అభివృద్ధి కోసమే ఆరు పథకాలు తేవడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదన్నారు. ఆ నాడు మాట ప్రకారం తెలంగాణ ఇచ్చామని.. నేడు ఇచ్చిన తెలంగాణను అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పారు. 

పేద ప్రజల కోసం రూ.10 లక్షల ఆరోగ్య కార్డు ఇస్తామని... మిగితా నాలుగు పథకాలను 100 రోజుల్లో ప్రారంభిస్తామని తెలిపారు. ఫార్మా సిటీలో జరిగిన అవినీతిని బయటకు తిస్తామని... ఫార్మా సిటీని రద్దు చేస్తామని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవీవెరుస్తాం.. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రజా దర్భార్ కార్యక్రమం పెట్టే ఆలోచన చేస్తున్నామని మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు.