వడ్ల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే మందుల సామెలు

వడ్ల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే మందుల సామెలు

తుంగతుర్తి, వెలుగు: రైతు సహకార సంఘాలు, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. సోమవారం తుంగతుర్తి, నూతనకల్ మండల కేంద్రాల్లో  రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే పంటను అమ్ముకోవాలన్నారు.  

రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఏ గ్రేడ్ ధాన్యానికి, రూ 2389, బి గ్రేడ్ ధాన్యానికి రూ. 2369 మద్దతు ధర ఇస్తుందని తెలిపారు. సన్న రకం ధాన్యానికి క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, రైతు సేవా సహకార సంఘం చైర్మన్ గుడిపాటి సైదులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకన్న, సిఓ యాదగిరి కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.