ఝరాసంగం, వెలుగు: ప్రభుత్వం నాఫెడ్ అధ్వర్యంలో మార్క్‌ఫెడ్ ద్వారా సోయా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్ సూచించారు. శనివారం మండల పరిధిలోని ఏడాకులపల్లి పీఏసీఎస్ సెంటర్లో సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
వారు మాట్లాడుతూ సోయాబీన్ పంటకు ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.5328 చెల్లిస్తోందని రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లోనే పంటను విక్రయించి లబ్ధిపొందాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ కాంతమ్మ, డైరెక్టర్లు అనంత్రామ్గౌడ్, శ్రీనివాస్, రాంచందర్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహాగౌడ్, ఏఓ వెంకటేశం, ఏఈఓ వేదా, సొసైటీ సీఈఓ శ్రీశైలం, రైతులు పాల్గొన్నారు.
