- డిప్యూటేషన్లపై ఎమ్మెల్యే రాగమయి ఆగ్రహం
పెనుబల్లి, వెలుగు : జీతం ఇక్కడ తీసుకుంటూ సర్వీస్ మాత్రం అక్కడ చేస్తున్నారా అని డిప్యూటేషన్లపై వెళ్లిన ఉద్యోగులపై సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెనుబల్లి మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అవుట్ సోర్సింగ్ శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బంది ఇక్కడ జీతం తీసుకుంటూ ఖమ్మం, మధిరలో ఉద్యోగాలు చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఖమ్మం డీసీహెచ్ ఎస్ రాజశేఖర్ కు ఫోన్ చేసి డిప్యూటేషన్లు క్యాన్సిల్ చేసి ఇక్కడ ఉద్యోగులను ఇక్కడే డ్యూటీ చేసేలా ఆదేశించాలని కోరారు. అనంతరం గంగాదేవిపాడు గ్రామానికి చెందిన బానోత్ జగన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్ ఉత్సవ కమిటీ ఎమ్మెల్యే దంపతుల ఫొటోలతో ఉన్న టీ షర్ట్ లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, డాక్టర్ రంజిత్, కల్లూరు ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు మట్టా దయానంద్ తదితరులు
పాల్గొన్నారు.