అన్నపురెడ్డిపల్లి మండలలో బతుకమ్మ చీరలు, స్పోర్ట్స్ కిట్లు పంపిణీ

అన్నపురెడ్డిపల్లి మండలలో బతుకమ్మ చీరలు, స్పోర్ట్స్ కిట్లు పంపిణీ

ఆడ పడుచులు బతుకమ్మ పండుగను సంబురంగా జరుపుకోవాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు అన్నారు. బుధవారం అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బోయినపల్లి సుధాకర్ రావుతో కలిసి మహిళలకు బతుకమ్మ చీరలు, యువకులకు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ భారత లాలమ్మ, వైస్ ఎంపీపీ మామిళ్లపల్లి రామారావు, సర్పంచ్ పద్మ పాల్గొన్నారు. అలాగే చండ్రుగొండ మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మెచ్చా శంకుస్థాపనలు చేశారు. చండ్రుగొండలో మహిళలకు బతుకమ్మ చీరలు, 14 పంచాయతీలకు స్పోర్ట్స్​కిట్లు అందచేశారు. ఖమ్మంలోని వేర్వేరుచోట్ల మంత్రి పువ్వాడ అజయ్​ బుధవారం బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.

జిల్లా వ్యాప్తంగా 4.27లక్షల చీరలు అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. పాల్వంచ మున్సిపల్​ఆఫీస్​వద్ద ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్పోర్ట్స్​కిట్లు పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ అజ్మీర స్వామి, జిల్లా క్రీడాధికారి పరంధామరెడ్డి, తహసీల్దార్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. జూలూరుపాడు మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో ఎమ్మెల్యే రాములు నాయక్ స్పోర్ట్స్ కిట్లు, సీఎంఆర్ఎఫ్​చెక్కులు, బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. తహసీల్దార్​శారద, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ కళావతి పాల్గొన్నారు.

గుండాల మండల కేంద్రంలో జడ్పీటీసీ వాగబోయిన రామక్క స్పోర్ట్స్​కిట్లు పంపిణీ చేశారు. పెనుబల్లి మండలం వియంబంజర్​లో ఫంక్షన్​హాల్​లో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. సత్తుపల్లిలోని జేవీఆర్​ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఆవరణలో సోర్ట్స్ కిట్లను అందజేశారు. మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, కమిషనర్ సుజాత పాల్గొన్నారు.