కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే సత్యం బాధ్యతల స్వీకరణ : మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడిగా  ఎమ్మెల్యే సత్యం బాధ్యతల స్వీకరణ : మంత్రి పొన్నం ప్రభాకర్
  • పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ 

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులైన చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం శుక్రవారం జిల్లా కాంగ్రెస్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎమ్మెల్యే కె.సత్యనారాయణ,  సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, లైబ్రరీ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. కార్యక్రమానికి ముందుగా అలుగునూరు చౌరస్తా నుంచి డీసీసీ ఆఫీస్ వరకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. 

డీసీసీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో మంత్రి పొన్నం మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నాయకుడిగా, యూత్ కాంగ్రెస్ చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడిగా ప్రారంభమైన మేడిపల్లి సత్యం ప్రస్థానం.. నేడు ఎమ్మెల్యేగా,  కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎదగడం సంతోషంగా ఉందన్నారు. తనతోపాటు ఎన్ఎస్‌‌‌‌‌‌‌‌యూఐలో పనిచేసిన సంగీతం శ్రీనివాస్, వైద్యుల అంజన్ కుమార్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అయ్యారన్నారు. మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ఉత్తర తెలంగాణకు గుండెకాయలాంటి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తనకు అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌కు, ఏఐసీసీ సెక్రటరీ మీనాక్షి నటరాజన్, జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కృతజ్ఞతలు తెలిపారు.