
వెలుగు: ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యే ఓమ్ ప్రకాశ్ శర్మకు ఎన్నికల సంఘం నోటీసులు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫేస్‌బుక్‌లో ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్, ప్రధాని మోడీకి సంబంధించిన పోస్టులను పెట్టినందుకు ఈసీ నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా “ పాకిస్థాన్ దిగొచ్చింది. మన వీర సైనికుడు తిరిగి వచ్చాడు. ప్రధాని మోడీ ఆయన్ను తక్కువ టైంలోనే తిరిగి తీసుకొచ్చారు, ఇది మోడీ విజయం” అని ఉన్న పోస్టర్లు కూడా ఉన్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వెంటనే వాటిని తొలగించాలని, దానిపై గురువారంలోపు వివరణ ఇవ్వాలని ఓమ్ ప్రకాశ్ ను ఆదేశించామని అధికారులు చెప్పారు. ఈ చర్య ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని దీనిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.