డ్రాపౌట్స్​ తగ్గించేందుకే బ్రేక్​ ఫాస్ట్​ స్కీం : పద్మా దేవేందర్​ రెడ్డి

డ్రాపౌట్స్​ తగ్గించేందుకే బ్రేక్​ ఫాస్ట్​ స్కీం : పద్మా దేవేందర్​ రెడ్డి

మెదక్​, వెలుగు:  గవర్నమెంట్ స్కూల్స్​లో డ్రాపౌట్స్ తగ్గించేందుకు, స్టూడెంట్స్​లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు సీఎం బ్రేక్​ ఫాస్ట్​ స్కీం ప్రారంభించారని ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టర్​ రాజర్షి షాతో కలిసి పట్టణంలోని గవర్నమెంట్​ గర్ల్స్​ హైస్కూల్లో సీఎం బ్రేక్​ ఫాస్ట్​స్కీంను ప్రారంభించారు. అనంతరం స్టూడెంట్స్​తో కలిసి బ్రేక్​ ఫాస్ట్​ చేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూల్స్​లో చదివే స్టూడెంట్స్​ అందరూ పేద కుటుంబాలకు చెందిన వారేనని.. వారు అర్ధాకాలితో స్కూల్​కు రావడం వల్ల నీరిసించిపోతున్నారని గుర్తించిన ప్రభుత్వం ఈ స్కీంను ప్రవేశపెట్టిందన్నారు. అక్షయ పాత్ర  ఫౌండేషన్   సౌజన్యంతో ప్రతిరోజూ మెనూ ప్రకారం బ్రేక్​ ఫాస్ట్​ అందిస్తారని తెలిపారు. కలెక్టర్​ మాట్లాడుతూ..  ఈ స్కీం ద్వారా జిల్లాలో 897  స్కూల్స్​లో  84,554  మంది స్టూడెంట్స్​కు లబ్ధి చేకూరతుందన్నారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్టూడెంట్స్​కు ప్లేట్లు, గ్లాసులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్​ చైర్మన్  చంద్రపాల్,  వైస్ చైర్మన్  మల్లికార్జునగౌడ్ ,  ఏఎంసీ చైర్మన్ బట్టి జగపతి ,  డీఈఓ రాధాకిషన్, డీఎస్​ఓ రాజిరెడ్డి, ఎంఈఓ నీలకంఠం పాల్గొన్నారు.