పద్మారావునగర్, వెలుగు: ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు మాత్రమే చీరలు ఇవ్వడం సరికాదని, పేద, మధ్యతరగతి మహిళలందరికీ పంపిణీ చేయాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావుగౌడ్డిమాండ్ చేశారు. ఆదివారం బౌద్ధనగర్ కమ్యూనిటీ హాల్‌లో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్హయాంలో బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక పేరుతో రేషన్ షాపుల వద్దే ఎలాంటి ఇబ్బంది లేకుండా మహిళలందరికీ చీరలు అందించామని తెలిపారు. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధీర్ సింగ్, యూసీడీ ప్రాజెక్టు అధికారి రజితా రెడ్డి, మాజీ కార్పొరేటర్లు కంది శైలజ, సామల హేమ, లింగాని ప్రసన్నలక్ష్మి పాల్గొన్నారు.
