మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటాం : ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి

మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటాం : ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి
  • ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి

ఆర్మూర్, వెలుగు :- - స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలోని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి అన్నారు. సోమవారం ఆర్మూర్​లో మామిడిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ యూత్ నాయకులు అరుణ్ తన అనుచరులతో ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలో చేరగా,  కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంపీ ధర్మపురి అరవింద్​ ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికల్లో సైనికుల్లా పని చేయాలన్నారు. 

దేశాభివృద్ధే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు.  నియోజకవర్గంలో బీజేపీ శ్రేణులతో కలిసి త్వరలో భారీ సభ ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ టౌన్​ ప్రెసిడెంట్ మందుల బాలు, చిన్నారెడ్డి, పోల్కం వేణు, జెస్సు అనిల్,పెద్దోళ్ల గంగారెడ్డి, కలిగోట్ గంగాధర్, మధు, పోచంపాడ్ శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.