నర్సంపేట, వెలుగు: నర్సంపేట మున్సిపల్కమిషనర్పై ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను మున్సిపల్ ఆఫీసులో ఈ నెల 6న ఉదయం 9 గంటలకు నిర్వహిస్తున్నామని, కౌన్సిలర్లు హాజరు కావాలని మున్సిపల్కమిషనర్ వెంకటస్వామి సర్క్యులర్జారీ చేశారు. ఈ సర్క్యులర్ఉమ్మడి వరంగల్జిల్లావ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరలైంది.
కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని ప్రతిపక్షాల నాయకులు ఫైర్ అయ్యారు. కాగా తన బర్త్‌డేను అధికారికంగా జరుపుకోవాలని జారీ చేసిన సర్క్యులర్‌ను వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. తన బర్త్‌డేను జరుపుకోవాలని తాను ఎవరికీ, ఎక్కడా ఎలాంటి సూచనలు జారీ చేయలేదని ఎమ్మెల్యే మీడియాకు విడుదల చేసిన నోట్లో పేర్కొన్నారు.
