
తాండూర్ MLA పైలెట్ రోహిత్ రెడ్డి ఇవాళ టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. ఉదయం 12 గంటల సమయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ఆయన ప్రగతి భవన్ లో కలుస్తారు. తాండూర్ నియోజకవర్గ అభివృద్ధి గురించి చర్చించి.. ఆ తర్వాత టీఆర్ఎస్ చేరడంపై చర్చిస్తారు.
నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలతో చర్చించి.. అతి త్వరలోనే టీఆర్ఎస్ లో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చేరాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని .. టీఆర్ఎస్ లో విలీనం చేసే ప్రక్రియ.. ఈ రాజకీయ పరిణామంతో క్లైమాక్స్ కు చేరినట్టయిందని చర్చ జరుగుతోంది.