
శంషాబాద్, వెలుగు: లిమ్స్ హాస్పిటల్ నాలుగో బ్రాంచ్‌ను రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లి టోల్గేట్ వద్ద ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ గురువారం ప్రారంభించారు. ఇప్పటికే షాద్ నగర్, ఇబ్రహీంపట్నం లాంటి ప్రాంతాల్లో లిమ్స్ హాస్పిటల్స్ సేవలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ స్మితా రామ్ రాజ్ తెలిపారు. ప్రత్యేకంగా మహిళలు చిన్నారుల కోసం తమ నాలుగో బ్రాంచ్‌గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించినట్లు డాక్టర్ రామ్ రాజ్ బృందం తెలిపింది.
కార్యక్రమంలో యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు లక్ష్మీ నరసింహచార్యులు, వేద భారతి పీఠం సంస్థాపకులు విద్యానందగిరి స్వామి, మోడల్ రష్మీ ఠాకూర్, షాద్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్, డాక్టర్ మార్కండేయులు, డాక్టర్లు శ్యాంసుందర్, శ్వేత పాల్గొన్నారు.