- మంచిర్యాల కార్పొరేషన్‌పై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం
- ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల/నస్పూర్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో మంచిర్యాల కార్పొరేషన్‌పై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. శనివారం ఓ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా మంచిర్యాలలో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సిస్టంను త్వరలోనే ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
సింగరేణి స్థలాల్లో నివసిస్తున్న కార్మిక కుటుంబాలకు రెండు నెలల్లో ఇండ్ల పట్టాలను పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు. ఐబీ చౌరస్తా వద్ద 600 బెడ్స్‌తో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ శ్రీపతి శ్రీనివాస్‌తో పాటు దాదాపు 200 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. డీసీసీ మాజీ చైర్ పర్సన్ కొక్కిరాల సురేఖ తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ పరికరాలతో సాగు సులభం
వ్యవసాయ పరికరాలతో రైతులకు సాగు సులభతరం అవుతుందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. జిల్లా వ్యవసాయ అధికారిణి సురేఖ, మంచిర్యాల ఏఎంసీ చైర్మన్ పయ్యావుల పద్మ ముణి, ఆత్మ బీఎఫ్ఏసీ చైర్మన్ సింగటి మురళితో కలిసి అర్హులైన రైతులకు వ్యవసాయ పరికరాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 2025-–26 సంవత్సరానికి గాను వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు వ్యవసాయ పరికరాలను రాయితీపై అందిస్తున్నట్లు తెలిపారు.
రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
