రామగుండం నియోజకవర్గ రూరల్ మండలాల్లో రూ.98.50 కోట్లతో పనులు : ఎమ్మెల్యే రాజ్ఠాకూర్

రామగుండం నియోజకవర్గ రూరల్ మండలాల్లో రూ.98.50 కోట్లతో పనులు : ఎమ్మెల్యే రాజ్ఠాకూర్

గోదావరిఖని, వెలుగు: రామగుండం నియోజకవర్గ పరిధిలోని రూరల్​ మండలాలైన అంతర్గాం, పాలకుర్తిలో వివిధ స్కీమ్‌‌‌‌ల కింద రూ.98.50 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే ఎంఎస్​రాజ్‌‌‌‌ఠాకూర్​తెలిపారు. గురువారం అంతర్గాం మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఈ నిధులతో రోడ్లు, డ్రైనేజీలు, వివిధ ఆఫీస్​బిల్డింగ్‌‌‌‌ల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. అంతర్గాం నుంచి  గోలివాడ వరకు రోడ్డు నిర్మాణ పనులు స్పీడ్‌‌‌‌గా నడుస్తున్నాయని, బుగ్గు రోడ్డు నుంచి గోదావరి వరకు, ఎల్కలపల్లి నుంచి ఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌ వరకు రోడ్డు పనులు చేపడుతున్నట్లు చెప్పారు. వివిధ గ్రామాల నుంచి గోదావరిఖనికి కనెక్టివిటీ పెరిగేలా రోడ్ల నిర్మిస్తున్నట్లు  వివరించారు.