
హైదరాబాద్, వెలుగు: శ్రీరాముడి శోభయాత్ర సందర్భంగా బుధవారం గోషామహల్ బీ జేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో పాకిస్తాన్‌లో హిందూ జెండా ఎగరేస్తామని వెల్లడించారు. బేగంబజార్ ఛత్రిలో శ్రీరాముడి ఊరేగింపులో భాగంగా..ఆయన భారీ వాహనంపై నిలబడి భక్తులనుద్దేశించి మాట్లాడారు. 2027 నాటికి భారతదేశాన్ని సంపూర్ణ హిందూ దేశంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అఖండ భారతావనిగా ముందుకు సాగుతామని చెప్పారు. మొఘల్ సామ్రాజ్యం హయాంలో దేశంలో 40 వేల మందిరాలు కూల్చివేశారని వివరించారు. దేశంలో మందిరాల నిర్మాణాలను కొందరు హిందూ తిరుగుబాటుదారులు అడ్డుకుంటున్నారని రాజాసింగ్ పేర్కొన్నారు.