ఫిట్ నెస్ కోసం ఒక్కొక్కరు ఒక్కో ప్లాన్ ఫాలో అవుతుంటారు. ఒక్కోరకం డైట్ అనుసరిస్తుంటారు. అయితే అవి ఎంతవరకు వర్కవుట్ అవుతున్నాయో గమనించుకోవాలి. ఏమన్నా తేడాలుంటే కొన్ని మార్పులు చేసుకోవాలి. అలా కానీ జాగ్రత్త పడలేదో 'ఏం చేసినా ఫలితం ఉండట్లేదని అసలుకే పూర్తిగా మానేసే ప్రమాదం ఉంది. అలాకాకుండా ఉండాలంటే మీ శరీరం మీరు పాటిస్తున్న ఫిట్ నెస్ రోటీన్ కు ఎలా రెస్పాండ్ అవుతుందో తెలుసుకోవాలి. అందుకు స్కేల్ ఈ కింద చెప్పే తొమ్మిది లక్షణాలు.
- రుచి అవీ ఇవీ తినమని అటుఇటు లాగుతోందా... వాటికి నోనో అంటూ మీరు చెప్పినట్టు మనసు వింటుందా అనేది చూసుకోవాలి.
- జంక్ ఫుడ్ వైపునకు పోకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటున్నప్పటికీ పొట్ట నిండినట్టు అనిపించాలి.
- మిమ్మల్ని మీరు డిఫరెంట్ చూసుకోగలుగుతున్నారా? అంటే శరీరం ఫిట్ గా అనిపిస్తుందన్నమాట.
- నీరసంగా కాకుండా బలంగా ఉండాలి.
- శక్తివంతంగా ఉంటారు.
- సంతోషంగా ఉంటారు.
- నిద్ర బాగా పడుతుంది.
- ఆందోళన పడటం తగ్గిపోతుంది.
- చిరాకు తగ్గిపోయి ... నలుగురితో ఆనందంగా ఉంటారు.
ఈ తొమ్మిది లక్షణాలు ఉన్నాయంటే మీ ఫిట్నెస్ రెజిమ్ పనిచేస్తున్నట్టే. పోషకాహారం తింటున్నట్టే. వీటిలో ఏ మాత్రం తేడా ఉన్నా ఒకసారి సరిచూసుకోవాలి. ఫిట్ నెస్ ఎక్స్పర్ట్ను సంప్రదించాలి. న్యూట్రిషనిస్ట్ ను కలవాలి. వ్యాయామం, ఆహారం రెండింటి విషయంలో రొటీన్ మార్చుకోవాలి
