పర్మిషన్ లేకున్నా రాయలసీమ లిఫ్ట్ కడుతున్నప్పుడు.. పాలమూరు-రంగారెడ్డి ఎందుకు కట్టలేదు: జూపల్లి

పర్మిషన్ లేకున్నా రాయలసీమ లిఫ్ట్ కడుతున్నప్పుడు.. పాలమూరు-రంగారెడ్డి ఎందుకు కట్టలేదు: జూపల్లి

విభజన చట్టం ప్రకారం ఎపీకి ఎంత హక్కు ఉందో.. తెలంగాణకు కూడా అంత వాటా ఉంది.. అలాంటప్పుడు ఎందుకు 299 టిఎంసిలకే మీరు సంతకం పెట్టిందని ప్రతిపక్షాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. అసెంబ్లీలో కృష్ణా జలాలు,  కెఆర్ఎంబీ వంటి అంశాలపై తీర్మానం చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రాజెక్టులపై బీఆర్ఎస్ నేతలు డ్రామాలు అడుతున్నారని.. ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ అన్నట్లు పరిస్థితి ఉందని హరీశ్ రావుకు కౌంటర్ ఇచ్చారు. నీటి వాటాపై బీఆర్ఎస్ ఎందుకు రాజీ పడిందో చెప్పాలన్నారు. ఏం చేయాలో అది చేయకుండా.. ఇప్పుడు ఏవేవో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇరిగేషన్ శాఖలో అవినీతి జరగలేదని ఎమ్మెల్యే హరీష్ రావు ఒప్పుకుంటారా? అని ప్రశ్నించారు. 

పర్మిషన్ లేకున్నా రాయలసీమ లిఫ్ట్ కడుతున్నప్పుడు.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. మరి కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా పర్మిషన్ లేకున్నా మూడేళ్లలో ఎలా కట్టారని.. 18 లక్షల ఎకరాలు పారే పాలమూరు ప్రాజెక్టును ఎందుకు నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకొచ్చిన అన్ని చట్టాలకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని.. మరి, మనకు రావాల్సిన ఖమ్మంలోని ఏడు మండలాల కోసం ఎందుకు పోరాడలేదని దుయ్యబట్టారు మంత్రి జూపల్లి.