రూ.235 కోట్లతో హాస్పిటల్ డెవలప్మెంట్ : ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి

రూ.235 కోట్లతో హాస్పిటల్ డెవలప్మెంట్ : ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: రూ.235 కోట్లతో ఆసుపత్రి డెవలప్​మెంట్​ పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నాగర్ కర్నూల్  మెడికల్  కాలేజీలో 650 పడకల ఆసుపత్రి పనులను ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడేది లేదన్నారు. 

నాగనూలు చెరువు సుందరీకరణకు రూ.3.14 కోట్లతో పనులు ప్రారంభించారు. పక్కనే ఉన్న ప్రైమరీ స్కూల్, అంగన్​వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం తాడూరు మండలం బలాన్ పల్లి గ్రామంలో రథసప్తమి సందర్భంగా ఒంగోలు జాతి పశువుల పోటీలను ప్రారంభించారు. ఎమ్మెల్యే క్యాంప్  ఆఫీస్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తిమ్మాజీపేట మండలం పోతిరెడ్డి గ్రామానికి చెందిన 40 మంది బీఆర్ఎస్  కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు.