ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ..పత్తి, సోయా కొనుగోళ్ల పరిమితిని పెంచాలి : ఎమ్మెల్యే రామారావు పటేల్

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ..పత్తి, సోయా కొనుగోళ్ల పరిమితిని పెంచాలి : ఎమ్మెల్యే రామారావు పటేల్

భైంసా, వెలుగు: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పత్తి, సోయా కొనుగోళ్ల పరిమితిని పెంచి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావును ముథోల్​ఎమ్మెల్యే రామారావు పటేల్ కోరారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్​తో కలిసి హైదరాబాద్​లో మంత్రికి వినతిపత్రం అందజేశారు. సోయా పంటను ఎకరాకు 6 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, ఈ పరిమితిని పెంచాలని కోరారు. సీసీఐ ద్వారా పత్తిని ఎకరాకు 7 క్వింటాళ్ల నుంచి 12 క్వింటాళ్ల వరకు పరిమితిని పెంచాలన్నారు. 

ముథోల్ నియోజకవర్గంలో భారీ వర్షాలతో సోయా పంట దెబ్బతిందని.. 20 శాతం డ్యామేజ్ ఉన్నా పంటను కొనుగోలు చేయాలని కోరారు. అసైన్డ్, ఎండో మెంట్, ఇనాం, వక్ఫ్ భూముల్లో పండించిన పంటను కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. కౌలు రైతులను గుర్తించి, వారి పంటలను కొనుగోలు కేంద్రాల్లో తీసుకునేలా చర్యలు తీసుకోవాన్నారు. ఈ విషయంపై మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.