
ముథోల్, వెలుగు: ముథోల్ మండలంలోని బ్రహ్మణ్గావ్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 5 వేల ఎకరాలకు సాగు నీరు అందజేస్తామని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యేలు నారాయణ్ రావు పటేల్, వేణుగోపాలాచారి హయాంలో రూ.80 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ చేపడితే.. పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ ఆ ప్రాజెక్ట్ పనులు పూర్తిచేయకుండా రైతులకు సాగు నీరు అందించలేదన్నారు. తాను అసెంబ్లీలో సమస్య ప్రస్తవించి, పలుమార్లు మంత్రులను కలువడంతో రూ. 5.88 కోట్ల నిధులు మంజూరయ్యయని తెలిపారు.
బాసర ఆలయాన్ని పునర్నిర్మించాలి
బాసర, వెలుగు: బాసర ఆలయ పునర్నిర్మించాలని రామారావు పటేల్ డిమాండ్ చేశారు. బాసర తహసీల్దార్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంఆలయాన్ని అభివృద్ధి చేస్తామని హామీలిచ్చి మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అధికారంలోకి వచ్చి18 నెలలు గడుస్తున్నా నిధులు విడుదల చేయడంలేదని మండిపడ్డారు.
ఇప్పటికైనా ఆలయ అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని డిమాండ్చేశారు. అనంతరం మండలంలోని 36 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు సాయినాథ్ పటేల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సతీశ్వర్ రావు, మాజీ జడ్పీటీసీలు రమేశ్, రాజేశ్వర్, సాయినాథ్, బిద్దుర్ రమేశ్తదితరులు పాల్గొన్నారు.