అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యం : ఎమ్మెల్యే రాందాస్ నాయక్

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యం : ఎమ్మెల్యే రాందాస్ నాయక్

కారేపల్లి, వెలుగు: అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. కారేపల్లి మండలంలోని వెంకిట్యాతండ, కారేపల్లి గ్రామాల్లో రూ.2 కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్లకు సోమవారం శంకుస్థాపన చేశారు. పేదలకు సన్న బియ్యం, అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. 

వెంకిట్యాతండాకు చెందిన మంగళం కంపెనీ ఎండీ రాజేందర్ స్థానిక ప్రైమరీ స్కూల్​కు డిజిటల్​తరగతులకు సంబంధించి రూ.5 లక్షల సామగ్రి అందించగా.. డిజిటల్​ క్లాస్​రూమ్​ఏర్పాటు చేశారు. ఈ గదిని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎంపీడీవో శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, ఏపీఎం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు చంద్రప్రకాశ్, దేవులా నాయక్, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

నాణ్యమైన వడ్లను తీసుకురావాలి

తల్లాడ, వెలుగు: రైతుల నాణ్యమైన వడ్లను కొనుగోలు కేంద్రాలను తీసుకువచ్చి, మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే రాందాస్​నాయక్​సూచించారు. ఏన్కూర్ లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను సోమవారం ప్రారంభించారు. బీఆర్ఎస్​ పాలనలో రైతులకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. 

వ్యవసాయ మార్కెట్లో పాత గోదాములను కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు. గార్ల ఒడ్డు సొసైటీ చైర్మన్ శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ లచ్చిరాం నాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు స్వర్ణ నరేందర్, నాయకులు పాల్గొన్నారు.