- ఎమ్మెల్యే రోహిత్, కలెక్టర్ రాహుల్రాజ్
మెదక్ టౌన్, వెలుగు: మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే రోహిత్‌రావు అన్నారు. శుక్రవారం కలెక్టర్ రాహుల్ రాజ్, అడిషనల్ కలెక్టర్నగేశ్ తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే రోహిత్ మాట్లాడుతూ.. రామాయంపేట హాస్పిటల్‌కు నూతన డయాలసిస్ సెంటర్ ఏర్పాటు కు ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్తపల్లి బ్రిడ్జి, చిన్నశంకరంపేట్ -మెదక్ రోడ్డు పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. ఏడుపాయల్లో మరుగుదొడ్లను వేగంగా నిర్మించాలన్నారు. దెబ్బతిన్న పాపన్నపేట ,కొత్తపల్లి కాల్వలకు రిపేర్లు చేయాలని, రాయిన్‌పల్లి, కొంటూరులో నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.
ధాన్యం కొనుగోలును మరింత వేగవంతం చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులు ప్రజలతో మర్యాదగా వ్యవహరించి వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. పాత పనులు త్వరగా పూర్తి చేసి నూతన పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అర్హులైన లబ్ధిదారులకే ప్రభుత్వ పథకాలు అందించాలన్నారు. అనంతరం హవేలీ ఘనపూర్ మండలంలోని సర్ధన పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
డాక్టర్ల హాజరు రిజిస్టర్లు, మందులను పరిశీలించి పీహెచ్‌సీకి వచ్చిన రోగులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సమావేశంలో ఆర్డీవో రమాదేవి, అధికారులు హేమభార్గవి, విజయలక్ష్మి, మాధవి, శివదయాల్, నీలిమ, దేవ్‌కుమార్, రాధాకిషన్, పరమేశ్వర్, నిత్యానందం, జగదీశ్వర్, ప్రకాశ్ రావు, వెంకటయ్య, ఎల్లయ్య, నారాయణ నాయక్, ప్రతాప్ పాల్గొన్నారు. గాయపడిన మహిళను ఆస్పత్రికి
తరలించిన ఎమ్మెల్యే
మెదక్మండలంలోని పేరూర్ గ్రామానికి చెందిన మాణశ్రీమ్మ శుక్రవారం పట్టణంలోని ఆటోనగర్ ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆమె తల, కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. ఇదే సమయంలో ఎమ్మెల్యే రోహిత్‌తన కాన్వాయ్‌లో వస్తూ గాయపడిన మాణశ్రీమ్మను చూశారు. వెంటనే కాన్వాయ్‌ని ఆపి గాయాలపాలైన మహిళను తన వాహనంలో మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఎమ్మెల్యే సైతం ఆస్పత్రికి వెళ్లి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. మహిళను కాపాడి మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యేను స్థానికులు కొనియాడారు.
