నిజాంపేటను అభివృద్ధిలో ముందుంచుతాం : ఎమ్మెల్యే రోహిత్ రావు

నిజాంపేటను అభివృద్ధిలో ముందుంచుతాం : ఎమ్మెల్యే రోహిత్ రావు

 నిజాంపేట, వెలుగు: నిజాంపేట మండలాన్ని అభివృద్ధిలో ముందుంచుతామని ఎమ్మెల్యే  రోహిత్ రావు అన్నారు. మంగళవారం ఆయన మండల కేంద్రంలో 22 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం జాతీయ ఆహార భద్రత స్కీం కింద సబ్సిడీ పై రైతులకు మొక్కజొన్న విత్తన ప్యాకెట్లను అందించారు. 

ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో రాజిరెడ్డి, అగ్రికల్చర్ ఆఫీసర్ లింగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.