సమన్వయంతో పని చేస్తేనే విజయం : ఎమ్మెల్యే రోహిత్

సమన్వయంతో పని చేస్తేనే విజయం :  ఎమ్మెల్యే రోహిత్
  •     ఎమ్మెల్యే రోహిత్ 

మెదక్, వెలుగు: పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ సమన్వయంతో పని చేస్తేనే పంచాయతీ ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల విజయం తేలికవుతుందని ఎమ్మెల్యే రోహిత్ అన్నారు. గురువారం మెదక్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో మెదక్ నియోజకవర్గంలోని వివిధ మండలాల  కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత సమావేశం నిర్వహించారు. 

ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ నాయకులు,  అనుబంధ సంఘాల బాధ్యులు, ముఖ్య కార్యకర్తలు  పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే అభివృద్ధి మరింత వేగవంతమవుతుందన్నారు.

 అభ్యర్థుల విజయమే గ్రామాల అభివృద్ధికి బలమైన పునాది అవుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ మెజారిటీ సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థులు గెలుపొందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రత్యర్థి పార్టీల తప్పుడు ప్రచారం తిప్పికొట్టాలన్నారు. సమావేశంలో డీసీసీ ప్రెసిడెంట్ ఆంజనేయులు గౌడ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.