
తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రాకు అన్యాయం చేయొద్దని నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కోరారు. తెలంగాణ ప్రభుత్వం పవర్ జనరేషన్ పేరుతో ఆంధ్రా, రాయలసీమకు అన్యాయం చేయొద్దని ఆమె తెలంగాణ ప్రభుత్వాన్ని అర్థించారు. కేఆర్ఎంబీ కేటాయింపుల ప్రకారమే తెలంగాణ నీటిని వాడుకోవాలని ఆమె అన్నారు. తెలంగాణ మంత్రులు ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొట్టొద్దని ఆమె సూచించారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల విషయంలో రోజుకో మాట మాట్లాడతారని రోజా విమర్శించారు. వైఎస్‌ను, జగన్‌ను ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తే ఊరుకునేది లేదని రోజా హెచ్చరించారు.