కాంగ్రెస్ గెలిస్తే కరెంటు ఉండదు : సంజయ్ కుమార్

కాంగ్రెస్ గెలిస్తే కరెంటు ఉండదు : సంజయ్ కుమార్

జగిత్యాల టౌన్‌‌‌‌, వెలుగు : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పంటకు 3 గంటలే కరెంట్​ఇస్తుందని, దీంతో పంటలు ఎండిపోయి పచ్చని భూములు ఎడారులు అవుతాయని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాల మండలం తిమ్మాపూర్, రఘురాములకోట, లక్ష్మీపూర్ గుట్రజ్ పల్లె, గుల్లపేట, అనంతరం గ్రామాల్లో జడ్పీ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్​వసంతతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పాలకులు తాగునీరు, సాగునీరు ఇవ్వకుండా ప్రజలను, రైతులను ఇబ్బందులకు గురిచేశారన్నారు.

సీఎం కేసీఆర్ 24గంటల కరెంట్​ఇస్తుండడంతో సమృద్ధిగా పంటలు పండుతున్నాయన్నారు. తమది పని చేసే ప్రభుత్వమని, మాటల ప్రభుత్వం కాదన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లీడర్లు చేస్తున్న ప్రచారం నమ్మి మోసపోవద్దన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి జగిత్యాల ఎమ్మెల్యేగా తనను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. 

ALSO READ : ఎన్నికల ఖర్చును గుర్తించేందుకు కమిటీ : పమేలా సత్పతి