ఎన్నికల ఖర్చును గుర్తించేందుకు కమిటీ : పమేలా సత్పతి

 ఎన్నికల ఖర్చును గుర్తించేందుకు కమిటీ :  పమేలా సత్పతి
  • జిల్లా ఎలక్షన్​ఆఫీసర్‌‌‌‌‌‌‌‌, కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్,వెలుగు : సున్నితమైన ఎన్నికల వ్యయ నియోజకవర్గాలు, ప్రాంతాల గుర్తింపు కోసం  ఇంటెలిజెన్స్​కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు  జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.  సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో  సీపీ అభిషేక్ మహంతితో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ...  ఈ కమిటీలో  రెవెన్యూ శాఖతో పాటు, పోలీస్, ఐటీ, జీఎస్టీ, బ్యాంకు అధికారులు సభ్యులుగా ఉంటారన్నారు. కమిటీ ఎన్నికల టైంలో చేసిన ఖర్చు, డబ్బు

మద్యం ఇతర వస్తువుల పట్టివేత సమాచారం ఆధారంగా ప్రాథమిక నివేదిక తయారు చేయాలన్నారు. జిల్లాలో ఎపిక్​కార్డులను వెంటనే పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్   శ్రీనివాసరావు, ఏసీపీ సీసీఎస్ మాధవి,  ఐటీ ​అధికారి డి.సుబ్బారెడ్డి, జీఎస్టీ జేసీ సీహెచ్.రవికుమార్, లీడ్ బ్యాంకు అధికారి ఆంజనేయులు పాల్గొన్నారు.  

12 రకాల గుర్తింపు కార్డులతో ఓటేయొచ్చు 

రాజన్నసిరిసిల్ల:----- ఎన్నికల్లో ఓటేసేందుకు ఎపిక్ కార్డుతోపాటు మరో 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి కలిగి ఉండాలనీ కలెక్టర్​అనురాగ్ జయంతి తెలిపారు. ఆధార్, ఉపాధిహామీ జాబ్ కార్డు, బ్యాంకు, పోస్టాఫీస్ ​పాస్ బుక్, కేంద్ర కార్మికశాఖ ఆరోగ్యబీమా స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఆర్టీఐ, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్ఎఐ) స్మార్ట్ కార్డు, పాస్ పోర్ట్, ఫొటోతో కూడిన పెన్షన్ పత్రాలు, ప్రభుత్వాలు, పీఎస్ యూలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డులతో ఓటేయొచ్చన్నారు. 

ALSO READ : ప్రజలే నా బలం, బలగం : రఘునందన్ రావు