
జగిత్యాల రూరల్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్, రూరల్ మండలం చలిగల్‌లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధిక సామర్థ్యం గల గోదాంల నిర్మాణం జగిత్యాలలో చేపట్టినట్లు చెప్పారు.
ప్రభుత్వం మక్క క్వింటాల్‌కు రూ.2400 మద్దతు ధర ఇస్తోందన్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాదిరిగా మక్కల కొనుగోలకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం మద్దతు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లత, మార్కెటింగ్ డిఈ ప్రకాష్, సివిల్ సప్లై డిఈ జితేందర్,ఎమ్మార్వో వరంధన్, మాజీ ఏఎంసీ చైర్మన్లు దామోదర్ రావు, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గిరిజన సంస్కృతిని కాపాడుకుందాం
రాయికల్, వెలుగు: గిరిజన సంస్కృతిని కాపాడుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ సూచించారు. బుధవారం రాయికల్ మండలం బోర్నపెల్లి శివారులోని చెల్కగూడెంలో గిరిజనుల దీపావళి సందర్భంగా నిర్వహించే దండారి ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల తండాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు.
ఏళ్లుగా గిరిజనులు దీపావళి దండారి ఉత్సవాలను వైభవంగా నిర్వహించుకుంటున్నారన్నారు. ఈ సందర్భంగా గిరిజనులు సంప్రదాయ నృత్యాన్ని తిలకించారు. జంగుబాయి దేవతను దర్శించుకొని పూజలు నిర్వహించారు. అంతకుముందు రాయికల్‌లో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు, లీడర్లు శ్రీనివాస్, రవిందర్‌రావు, లత, శేఖర్‌రెడ్డి, ఎంపీడీవో చిరంజీవి, తహసీల్దార్ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.