బీఆర్ఎస్ పాలనలో చెరువుల్లో జలకళ : సంజయ్ కుమార్

బీఆర్ఎస్ పాలనలో చెరువుల్లో జలకళ :  సంజయ్ కుమార్

జగిత్యాల టౌన్, రాయికల్ : బీఆర్ఎస్ పాలనలో చెరువులు జలకళను సంతరించుకున్నాయని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. రాయికల్ పట్టణంలో వివిధ కుల సంఘాల పెద్దలు, కార్యవర్గ సభ్యులను కలిసి కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో తొంబరావుపేట పక్క నుంచి కాలువ పోతున్నా చెరువుల్లో నీళ్లు ఉండేవి కావని, సీఎంతో మాట్లాడి కాలువను బాగు చేయించడంతో తొంబరావుపేటతోపాటు పోరుమల్ల, మైతాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇటిక్యాల, కొత్తపేట, బోర్నపెల్లి వరకు చెరువులు ఎండాకాలంలోనూ నిండుకుండలా మారాయన్నారు.

కాంగ్రెస్ పాలనలో సర్కారు బడులు, ప్రభుత్వ దవాఖానలు, కరంటు సరఫరా ఎట్లుండేదో ప్రజలు ఆలోచించాలన్నారు. ఆడబిడ్డల పెళ్లిళ్లకు కాంగ్రెస్​పార్టీ ఒక్క రూపాయి ఇవ్వలేదని, ఇప్పుడు మాత్రం రూ.లక్షతోపాటు తులం బంగారం ఇస్తామని మాయమాటలు చెబుతున్నారన్నారు. రాయికల్ మండలం రామాజీపేట గ్రామానికి చెందిన 200మంది గ్రామస్తులు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు. జగిత్యాలలోని  10,25,3,4,19 వార్డుల్లో ప్రచారం చేశారు.