నల్లవాగు కెనాల్ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

నల్లవాగు కెనాల్ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

నారాయణ్ ఖేడ్, వెలుగు: ఖేడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్ నల్లవాగు కెనాల్ పనులను ఎమ్మెల్యే సంజీవరెడ్డి మంగళవారం ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు రెండు పంటలు పండించుకోవడానికి ఈ కెనాల్ ఎంతో ఉపయోగపడుతుందని నిర్మాణ పనులు క్వాలిటీగా చేపట్టడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆయన వెంట ఇరిగేషన్ సీఈ అజయ్ కుమార్, ఎస్ఈ మురళీధర్, ఈఈ భీం, డీఈఈ పవన్ కుమార్ ఉన్నారు.