
-
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే శంకర్
షాద్ నగర్, వెలుగు: షాద్ నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హైదరాబాద్లో కలిసి, వినతి పత్రం అందించారు. నియోజకవర్గంలో 9 చెక్ డ్యామ్ ల కోసం 20.68 కోట్ల రుపాయలు,17 చెరువుల వద్ద మౌలిక సదుపాయాల కోసం 27.30 కోట్లు మొత్తం 26 పనులకు 47.98 కోట్లు మంజూరు చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే శంకర్ మాట్లాడారు. త్వరగా నిధులను మంజరు చేయలని వినతి పత్రంలో కోరినట్లు తెలిపారు.