భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో .. ఇంటర్ ఎడ్యుకేషన్పై సర్కార్ స్పెషల్ ఫోకస్

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో .. ఇంటర్ ఎడ్యుకేషన్పై సర్కార్ స్పెషల్ ఫోకస్
  • నీట్​, ఎంసెట్​ పరీక్షలకు స్పెషల్​ కోచింగ్​
  • ఈ నెల15 నుంచి డిసెంబర్​ 31 వరకు ట్రైనింగ్​ 
  • జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్, నీట్, ఎంసెట్, క్లాట్​ఎగ్జామ్స్​కు ప్రిపరేషన్​ 
  • మౌలిక సదుపాయాలు, రిపేర్ల కోసం14జూనియర్​ కాలేజీలకు రూ. 3.35కోట్లు రిలీజ్​ 
  • స్పెషల్​గా స్పోర్ట్స్​ మెటిరీయల్​కోసం రూ.1.40లక్షలు సాంక్షన్​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఇంటర్​ ఎడ్యుకేషన్​పై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్​ ఫోకస్​పెట్టింది. కార్పొరేట్​ కాలేజీలకే పరిమితమైన జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్, నీట్, ఎంసెట్, లా కోర్స్​కు సంబంధించిన కోచింగ్​ను గవర్నమెంట్​జూనియర్​కాలేజీల్లో ఇచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్​చేసింది. ఇందులో భాగంగా రోజుకు రెండు పీరియడ్స్​ చొప్పున ఆయా ఎంట్రన్స్​ ఎగ్జామ్స్​ కు ఆన్​లైన్​ ద్వారా కోచింగ్​ఇచ్చే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం శ్రీకారం చుట్టింది. గవర్నమెంట్ కాలేజీల్లో మౌలిక సదుపాయాలు, రిపేర్ల కోసం స్పెషల్​ ఫండ్స్​ రిలీజ్​ చేసింది.

ఇప్పటి నుంచే స్పెషల్​క్లాసులకు శ్రీకారం..

కార్పొరేట్​కాలేజీల్లో చదివే స్టూడెంట్స్​కు దీటుగా గవర్నమెంట్​ కాలేజీల్లో చదివే స్టూడెంట్స్​పోటీ పడేలా స్పెషల్​ క్లాసులు నిర్వహించాలని నిర్ణయించారు. ఇంటర్మీడియట్​ సైన్స్​ గ్రూపుల స్టూడెంట్స్​కు  జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్, నీట్​, ఎంసెట్, ఆర్ట్స్​ గ్రూప్​ స్టూడెంట్స్​కు న్యాయవిద్యకు సంబంధించిన కామన్​ లా అడ్మిషన్స్​ టెస్ట్​కు అవసరమైన  ఆన్​లైన్​శిక్షణ ఇస్తారు.

 ఈ నెల 15 నుంచి డిసెంబర్​ 31వ తేదీ వరకు రోజుకు రెండు పిరియడ్స్​ చొప్పున ఈ ఆన్​లైన్​ క్లాసులను ఫిజిక్స్​వాలా కోచింగ్​ సెంటర్​ ద్వారా నిర్వహిస్తున్నారు. జేఈ మెయిన్స్, అడ్వాన్స్, నీట్, ఎంసెట్, క్లాట్​లాంటి ఎంట్రన్స్​ ఎగ్జామ్స్​కు సంబంధించి మొదటి నుంచే స్పెషల్​క్లాసులను మొదలు పెట్టడం పట్ల స్టూడెంట్స్​తో పాటు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం 
చేస్తున్నారు. 

మౌలికక వసతుల కోసం రూ. 3.35కోట్లు రిలీజ్..

జిల్లాలోని 14  గవర్నమెంట్​ జూనియర్​ కాలేజీల్లో మౌలిక సదుపాయాలు, రిపేర్ల కోసం ప్రభుత్వం రూ. 3.35కోట్లను రిలీజ్​ చేసింది. స్పోర్ట్స్​మెటీరియల్​ కోసం ప్రత్యేకంగా రూ. 1.40 లక్షలను సాంక్షన్​ చేసింది. కాలేజీ మెయిన్​టెనెన్స్​ కోసం రూ.3.16లక్షలను ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులతో కాలేజీలో మౌలిక సదుపాయాలు, మైనర్​ రిపేర్ల కోసం వినియోగించనున్నారు. 

కాలేజీల వారీగా సాంక్షన్​ అయిన నిధులు

కాలేజీ    ఫండ్స్​ 

కొత్తగూడెం    రూ. 58,50,000
భద్రాచలం    రూ. 15,40,000
పాల్వంచ    రూ. 13,34,000
మణుగూరు    రూ. 16,84,000
అశ్వాపురం    రూ. 18,26000
ఇల్లెందు    రూ. 37,34,000
అశ్వారావుపేట    రూ. 9,41,000
చర్ల    రూ. 22,90,000
బూర్గంపహడ్​     రూ. 22,76,000
పినపాక    రూ. 18,76,000
గుండాల    రూ. 14,26,000
టేకులపల్లి    రూ. 31,26,000
దుమ్ముగూడెం    రూ. 17,34,000
ముల్కలపల్లి    రూ. 39,34,000
మొత్తం    రూ. 3,35,71,000