మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మరో వివాదంలో చిక్కుకున్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీకి ముఖ్యమంత్రి కేసీఆర్ కేటాయించిన రూ. 50 కోట్ల నిధుల వినియోగంపై శంకర్ నాయక్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహబూబాబాద్ మున్సిపాలిటీకి విడుదలైన నిధులపై ఎమ్మెల్యే శంకర్ నాయక్ పెత్తనం చలాయిస్తున్నారని అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు. ప్రతి వార్డుకు కోటి చొప్పున నిధులను కేటాయించాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ కు వినతీపత్రం అందజేశారు.