పద్మారావునగర్: అధిష్ఠానం పిలుపు మేరకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ గురువారం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ ఇన్చార్జీ సెక్రటరీలు విశ్వనాథన్, సచిన్ సావంత్‌ను కలిశారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం వ్యూహాలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.
వికారాబాద్ నేతలతోనూ చర్చలు
వికారాబాద్: వికారాబాద్ నియోజకవర్గానికి చెందిన పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల రఘువీర్‌రెడ్డి, వికారాబాద్పట్టణ అధ్యక్షుడు అర్థ సుధాకర్‌రెడ్డి కూడా మీనాక్షి నటరాజన్తో గురువారంవేర్వేరుగాభేటీ అయ్యారు. ఇటీవల వికారాబాద్‌జిల్లా కాంగ్రెస్అధ్యక్ష పదవికి వీరు పోటీ పడగా, అధిష్ఠానం ధారాసింగ్‌ను నియమించింది. ఈ క్రమంలో అసంతృప్తితో ఉన్న ఇరువురు నాయకులతో ఆమె మాట్లాడారు. వికారాబాద్‌జిల్లా రాజకీయాలపై చర్చించారు.
