మానవత్వం చాటిన ఎమ్మెల్యే జాజాల

మానవత్వం చాటిన ఎమ్మెల్యే జాజాల

లింగంపేట, వెలుగు: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ మానవత్వం చాటుకున్నారు. ఎల్లారెడ్డి మండలం వెల్లుట్లకు చెందిన హన్మండ్లు సోమవారం తన మనుమరాలు అంకితను తాడ్వాయి హాస్టల్​లో విడిచిపెట్టడానికి బైక్​పై తీసుకెళ్తున్నాడు. లింగంపేట పోలీస్​స్టేషన్​సమీపంలో బైక్​ అదుపుతప్పి ఇద్దరూ కింద పడ్డారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే సురేందర్​ వారిని గమనించి, గాయపడ్డ తాతా మనువరాలిని తన వెహికల్​లో లింగంపేటలోని ఓ హాస్పిటల్​కు తీసుకెళ్లి ట్రీట్​మెంట్​ఇప్పించారు.