భద్రాచలం, వెలుగు : చర్ల మండలంలోని కుదునూరు, సత్యనారాయణపురం, చర్ల, మేడివాయి, గొమ్ముగూడెం గ్రామాల్లో సోమవారం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్నరకం ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతే రాజు అన్న నినాదంతో రైతు కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన వెంటనే అధికారులు తీసుకోవాలని ఆదేశించారు. ఎలాంటి షరతులుపెట్టొద్దని సూచించారు.
