సునీతను పరామర్శించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

సునీతను పరామర్శించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

భద్రాచలం, వెలుగు: మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి తీవ్రంగా గాయపడిన డర్రా సునీతను భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు శుక్రవారం పరామర్శించారు. పామునూరు గుట్టల్లోని బెడం మల్లన్నను దర్శించుకునేందుకు గ్రామస్తులతో కలిసి వెళ్తుండగా, గురువారం ఈ ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన ఎమ్మెల్యే.. ప్రభుత్వం ద్వారా సహాయం అందించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.