
వనపర్తి, వెలుగు: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. బుధవారం ఓ కన్వెన్షన్ హాల్లో టీయూడబ్ల్యూజే, -ఐజేయూ జిల్లా మూడో మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో జర్నలిస్టులను హీనంగా చూశారని, కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తోందని తెలిపారు.
నియోజకవర్గంలోని జర్నలిస్టులు అందరికీ ఇండ్లు కట్టిస్తానని చెప్పారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి రాంనారాయణ, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, కార్యదర్శి మధుగౌడ్ పాల్గొన్నారు.