మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : కలెక్టర్ ఆదర్శ్ సురభి

మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ  ధ్యేయం : కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, వెలుగు : మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఇందులో భాగంగానే జిల్లాలో చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టిందని కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని నల్లచెరువులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేపల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

 జిల్లాలోని మత్స్యకారుల జీవనోపాధిని కోసమే ప్రభుత్వం చేప పిల్లలను పంపిణీ చేస్తోందని తెలిపారు. రాబోయే రోజుల్లో జిల్లాలో 2.20 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ గ్రౌండ్స్​లో వింగ్స్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనపర్తి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కలెక్టర్ కొద్దిసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో మత్స్యశాఖ డీడీ ఖదీర్ అహ్మద్, ఏడీ లక్ష్మప్ప, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మత్స్యకార సహకార సంఘాల నేతలు పాల్గొన్నారు.