ప్రజలపై లక్ష్మీదేవర ఆశీస్సులు ఉండాలె : వివేక్​ వెంకటస్వామి

ప్రజలపై లక్ష్మీదేవర ఆశీస్సులు ఉండాలె : వివేక్​ వెంకటస్వామి
  •     బోనాల వేడుకల్లో ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి
  •     ఘనస్వాగతం పలికిన గ్రామస్తులు

కోల్​బెల్ట్/జైపూర్/బెల్లంపల్లి, వెలుగు : ముదిరాజ్​ కులస్తుల ఆరాధ్య దైవం లక్ష్మీదేవర తల్లి బోనాల వేడుకల్లో చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్​ వెంకటస్వామి పాల్గొన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో నిర్వహించిన అమ్మవారి బోనాల వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు వివేక్ తెలిపారు. అంతకు ముందు ఎమ్మెల్యేకు గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు డప్పుచప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. ఆలయ పూజారులు శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. వేడుకల్లో భీమారం జడ్పీటీసీ భూక్య తిరుమల, కాంగ్రెస్ లీడర్లు చేకుర్తి సత్యనారాయణ రెడ్డి, పొడేటి రవి, భూక్య లక్ష్మణ్, మోహన్​రెడ్డి, ముదిరాజ్ కులస్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 

వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే..

జైపూర్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, కాంగ్రెస్ ​లీడర్ గోనె నర్సయ్య అన్న కూతురు ఆద్యశ్రీ, సుధాకర్ వధూవరులను ఎమ్మెల్యే వివేక్​ ఆశీర్వదించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలోని ఎంఎన్ఆర్ గార్డెన్స్​లో రాత్రి జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కలవేని శంకర్, శారద దంపతుల కుమారుడు నరేశ్,సుచిత్ర మ్యారేజ్ రిసెప్షన్​కు ఎమ్మెల్యే వివేక్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వేడుకలకు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, వివిధ రాజకీయ, కార్మిక నేతలు హాజరయ్యారు.

యువతి కుటుంబానికి పరామర్శ​

మందమర్రి మండలం మామిడిగట్టు గ్రామానికి చెందిన నాంపెల్లి సంగీత ఇటీవల ఆత్మహత్యకు పాల్పడగా బాధిత కుటుంబసభ్యులను వివేక్
​వెంకటస్వామి పరామర్శించారు. సంగీత ఫొటోకు నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే వెంట చిర్రకుంట మాజీ సర్పంచ్​ ఓడ్నాల కొమురయ్య, కాంగ్రెస్​లీడర్లు గద్దె రాంచందర్, మాజీ ఎంపీటీసీ దుర్గం కుమార్, మాజీ సర్పంచులు సుంకరి నంబయ్య, రాజయ్య, మనోహర్, పోశమల్లు పాల్గొన్నారు. 

కార్మికుడి కుటుంబానికి న్యాయం చేస్తం

మందమర్రి ఏరియా సింగరేణి స్టోర్స్ వద్ద జరిగిన ప్రమాదంలో కాసీపేట-2 గని కార్మికుడు చనిపోవడం బాధాకరమని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే వివేక్​ హామీ ఇచ్చారు. సోమవారం సాయంత్రం బెల్లంపల్లి మండలం పెరికపల్లి గ్రామంలోని కార్మికుడు కర్రె రాజు కుటుంబసభ్యులను పరామర్శించి వారికి అండగా ఉంటానన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున సింగరేణి సంస్థతో మాట్లాడి న్యాయం చేస్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా సంస్థతో మాట్లాడుతానన్నారు. అంతకు ముందు కర్రె రాజు ఫొటోకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.